బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన

బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన

– ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్…

బాపట్ల, కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (ఏప్రిల్ 9, గురువారం) బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణం, సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు ఎండ వేడి తగలకుండా చలువ పందిళ్లు, సరిపడా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.

Leave a Reply