సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌…

సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌…

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని సివిఏపీ యూనిట్ కార్యాలయాన్ని బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావే శాన్ని నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలకు సంబంధించిన ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత ప్రగతి మరియు భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేపట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్య కార్యక్రమాలను వివరించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమలులో ఉన్న పథకాల పురోగతిని పరిశీలించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గదర్శకాలు ఇచ్చారు. సానుకూల, ఫలప్రదమైన చర్చలతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి అఖిల, ఉరవకొండ ఎంపీడీవో రవి ప్రసాద్, యంగ్ ప్రొఫెషనల్ దిలీప్, సి వి ఏ పీ టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply