కలకత్తా ఉగాది వేడుకకు బుద్ధప్రసాద్..

కలకత్తా ఉగాది వేడుకకు బుద్ధప్రసాద్..

ఉగాది విశిష్ట పురస్కారం అందుకోనున్న ఎమ్మెల్యే
కలకత్తా వేదికగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ నెల 29న కలకత్తాలో ఉగాది విశిష్ట పురస్కారం అందుకోనున్నారు. కలకత్తా ఆంధ్ర సంఘం వారి 90వసంతాల తెలుగు వెలుగులు పురస్కరించుకొని ఆయనకు ఈ పురస్కారం అందించనున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరిగా, సాంస్కృతిక విద్యా రంగాల్లో చేస్తున్న కృషి, తెలుగు భాషా వికాసానికి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపుగా ఆదివారం ఉదయం 10గంటలకు ఈ పురస్కారం అందించనున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని, ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారిని ఆహ్వానించి తెలుగు భాష ఔన్నత్యం ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు, రాష్ట్రేతర ఆంధ్రులు, ప్రవాస భారతీయులు సంఘాలుగా ఏర్పడి తెలుగు భాషా వికాసానికి అంకితమయ్యేందుకు బాటలు వేసిన మహనీయుడు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు కలకత్తా ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Leave a Reply