రైతు భరోసా కై దరఖాస్తుల ఆహ్వానం

రైతు భరోసా కై దరఖాస్తుల ఆహ్వానం
వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామమోహన్ కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ లోపు నూతన పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పట్టాదారు పాస్ బుక్ కలిగి, రైతు భరోసా రాని రైతులు ఈ నెల 25 లోపు రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు వద్ద దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా రైతులు తమ బ్యాంక్ ఖాతాలు అప్ డేట్ చేసుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిచిందన్నారు. రైతు భరోసా దరఖాస్తు తో పాటు ఆధార్, పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్సులతోపాటు మొబైల్ నెంబర్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
