కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి
చౌటుప్పల్,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిసరాలలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకొని తమ ఆరోగ్యాలను, పంట భూములను, నీటిని కాపాడాలని ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని బాధిత రైతులు, గ్రామస్తులు అంబర్ పేట లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
బాధిత రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి కాలుష్యం బోర్డు మెంబర్ సెక్రటరీ తో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తో చరవాణిలో మాట్లాడి కాలుష్యం తీవ్రతను తెలిపి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీని కలిసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ కోఆర్డినేటర్ చేగూరి ప్రభాకర్, బాధిత రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి, రావుల రాంరెడ్డి, ధనలక్ష్మివస్పరి ప్రభ, వస్పరి లింగయ్య తదితరులు ఉన్నారు.
