ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండలంలో పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. మండలంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అట్టి కేంద్రాలలో 633 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
ఎలాంటి ఆబ్సెంట్ లేకుండా 100% విద్యార్థులు పరీక్ష తక్కువ హాజరైన ఆయన చెప్పారు. మాస్ కాపీయింగ్ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పెద్ద మల్లారెడ్డి, జంగంపల్లి గ్రామంలో హర్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
