మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలో వివిధ గ్రామాలలో అకాల మరణం చెందిన మృతుల కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొంపల్లి విజేందర్ రావు కుమారుడు బొంపల్లి ప్రశాంత్ రావు మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

అదేవిధంగా మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు దార రామచంద్రయ్య ఇటీవల మృతిచెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply