రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం

రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం
- ఎండిపోతున్న పంటలకు అండగా నిలిచిన సర్పంచ్
- రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం
- సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : వేసవి కాలం సమీపిస్తుండగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోవడంతో సాగునీటి కొరత ఏర్పడి పచ్చగా ఉన్న పంటలు ఎండిపోతాయేమో అన్న భయం స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామ రైతుల్లో నెలకొంది. పంటలే మా జీవనాధారం…నీరు లేకపోతే పంటలు ఎండిపో తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గ్రామ సర్పంచ్ పురుమాని కోమల ఐలోని గుర్తించారు. సర్పంచ్ కాకముందే ఎన్నో సార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అయినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన తరువాత వెంటనే స్పందించారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. గ్రామంలోని పెద్ద చెరు వు తూము గత 15సంవత్సరాలుగా మరమ్మతులు చేయకపోవడంతో చెరువులో నీరు నిండుగా ఉన్నప్పటికీ పంట పొలాలకు చేరడం లేదు. మార్చి నెల వచ్చేసరికి పంటలు ఎండిపోతున్నాయని వారు తెలియ జేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు చెరు వు తూము మరమ్మతులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశా లు జారీ చేశారు. దీంతో సర్పంచ్ సమస్యను తాత్కాలికంగా పరిష్కరిం చేలా రైతులకు అండగా నిలిచారు.

సర్పంచ్ చొరవతో పంటలకు సాగునీరు
గ్రామంలోని పెద్ద చెరువును సర్పంచ్ చొరవతో సంబంధిత అధికారులు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు చెరువులోని నీటి మట్టం, నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తూముకు శాశ్వత పరిష్కారం చేసే వరకు ముందుగా చెరువులోని నీటిని అలుగు వైపు నుంచి పైపుల ద్వారా తాత్కాలికంగా సాగునీరు విడుదల చేసే పనులను ప్రారంభించారు. ఈ చెరువు తూము కింద సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు సాగుభూమి ఉండటంతో ఈ నీరు రైతులకు నిజమైన జీవజలంగా మారనుంది. సాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారంకు చొరవ చూపిన గ్రామ సర్పంచ్ పురుమాని కోమల ఐలోని కి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

