14 YRS | క్రేజీ మూవీలో మనోజ్…?

14 YRS | క్రేజీ మూవీలో మనోజ్…?

14 YRS | మనోజ్ కోసం బాలయ్య చేసిన సాయం..
బాలయ్య కోసం మనోజ్ సిద్ధమా..?
మలినేని గోపీచంద్ – బాలయ్య క్రేజీ కాంబో
14 ఏళ్ల బాకీ తీర్చుకునే టైమా..?
డేవిడ్ రెడ్డితో హీరోగా రీ ఎంట్రీ

14 YRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా సినిమాలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమా కోసం బాలయ్య (Balayya) రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించారని అప్పట్లో చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలయ్య సినిమాలో మనోజ్ నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఆ సినిమా ఏంటి..? అసలు ఇది నిజమేనా..?

Balakrishna

14 YRS | మనోజ్ కోసం బాలయ్య..

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ ముగ్గురు హీరోలు వేరే హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ చేశారు కానీ.. బాలయ్య మాత్రం వేరే హీరోల సినిమాల్లో (Movies) క్యామియో రోల్స్ కీలక పాత్రలు చేయలేదు. అయితే.. మంచు మనోజ్ కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. మనోజ్ అడిగిన వెంటనే.. కాదనుకుండా బాలయ్య నటించారు. అదే.. ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా. ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు కానీ.. బాలయ్య, మనోజ్.. ఇద్దరూ కలిసి నటించిన సినిమాగా అందరిలో ఆసక్తి కలిగించింది. కొంత మేరకు మెప్పించింది.

Balakrishna

14 YRS | బాలయ్య కోసం మనోజ్..

ఇప్పుడు బాలయ్య హీరోగా మలినేని గోపీచంద్ తెరకెక్కించే సినిమాలో మంచు మనోజ్ (Manoj) కీలక పాత్ర పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాని ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారు. బాలయ్య, మలినేని గోపీచంద్ కాంబోలో గతంలో వీరసింహారెడ్డి అనే సినిమా రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు రానున్న ఈ క్రేజీ కాంబో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మనోజ్ ని అనుకున్నారట. ఇటీవల మనోజ్ కి మలినేని గోపీచంద్ స్టోరీ నెరేట్ చేయడం కూడా జరిగిందని టాక్.

Balakrishna

14 YRS | డేవిడ్ రెడ్డితో హీరోగా రీ ఎంట్రీ..

మనోజ్ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసాడు. అయితే.. కొన్ని కారణాల వలన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇప్పుడు డేవిడ్ రెడ్డి సినిమాతో హీరోగా (Hero) రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే.. బాలయ్య మూవీలో నటించాల్సి వస్తే.. ఆ పాత్ర చిన్నదైనా సరే.. మనోజ్ మరో ఆలోచన లేకుండా నటిస్తాడు. ఎందుకంటే.. గతంలో మనోజ్ కోసం బాలయ్య నటించారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే నటించకుండా ఉండడు. ఈ క్రేజీ మూవీలో మనోజ్ నటిస్తే 14 సంవత్సరాల బాకీ తీర్చినట్టు అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సో.. త్వరలోనే దీని గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply