ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత, ఎన్ ఎస్ ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా విద్యార్థులకు వ్యాసరచనలో మహిళా సమస్యల పరిష్కారంలో పోలీస్ పాత్ర అనే అంశం, వక్తృతపు పోటీలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు -పరిష్కార మార్గాలు అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన మహిళా విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉరవకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానం చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మస్తాన్నప్ప, ఉరవకొండ పట్టణ హెడ్ కానిస్టేబుల్ సుంకన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి సమాజంలో మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రభుత్వం చేపడుతున్న చట్టాలపై పూర్తిగా అవగాహన కలిగించుకోవాలని, మహిళ లు రక్షణ కొరకు నిరంతరం పోలీస్ శాఖ తోడుగా ఉంటారని మహిళా విద్యార్థు లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, అరవింద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకట రాముడు, పరమేష్, అధ్యాపకులు డాక్టర్ రాజేష్, డాక్టర్.అయ్యన్న, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రమేష్ బాబు, గాయత్రి, రామాంజనేయులు, ప్రశాంత్, నాగేంద్ర, అధ్యాపకులు పాల్గొన్నారు.
