నేరస్తులతో అప్రమత్తంగా ఉండాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : స్టేషన్‌కు వచ్చేబాధితులకు అండగా ఉంటూ,నేరస్తులతో అప్రమత్తంగా ఉండాలనిచిట్యాల సీఐ దగ్గు మల్లేష్ మల్లేష్, కోరారు , ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఐ మల్లేష్, ఎస్సై శ్రావణ్ కుమార్‌తో కలిసి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై ఆయన కీలక సూచనలు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండాలని,వారి సమస్యలను సానుభూతితో విని భరోసా కల్పించాలన్నారు కానీ, తప్పు చేసిన నిందితుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని కోరారు.
డ్యూటీకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా లాఠీలు వెంట తీసుకెళ్లాలని సరైన సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. విధి నిర్వహణలో ఎక్కడా లాలూచీ పడకూడదని, నిజాయితీగా పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలని సూచించారు. ప్రజల దృష్టిలో పోలీస్ ఇమేజ్‌ను పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ కుమార్, ఎస్సై త్రీ ఈశ్వరయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
