పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
తిరువూరులో ముందస్తు పెన్షన్ల పండగ
ఇంటింటికీ వెళ్లి మరి పంపిణి
లబ్ధిదారులతో మమేకమైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
చంద్రబాబు ముందుచూపు ఫలితమే అభివృద్ధి
తిరువూరు,ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలోని గానుగపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, ముందుగానే ఫిబ్రవరి 28న మార్చి నెల పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

పెన్షన్ మొత్తాన్ని పెంచి ప్రతి నెల 1వ తేదీన లేదా ముందుగానే అందించడం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వంటి బలహీన వర్గాల జీవనోపాధి మెరుగుపడుతోందన్నారు. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లు సమయానికి అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, టిడిపి ఎస్సి సెల్ అధ్యక్షుడు హోటల్ జంగయ్య, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సత్యం, మైనార్టీ సభ్యుడు జాన్ పాషా, కోట రాజశేఖర్, గ్రామ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి నందా, బీసీ నాయకుడు మాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

