శానిటేషన్, విద్యుత్, త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తా

శానిటేషన్, విద్యుత్, త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తా
- మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ అరేగూడెం లో శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్, దోమల నివారణకు చర్యలు చేపడుతామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం స్థానిక ప్రజల సమస్య లను అడిగి త్వరలో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానంగా దోమల నివారణకు సిబ్బంది డ్రైనేజీ ల వద్ద పిచికారీ చేస్తున్న పనులను చైర్మన్ పరిశీలించారు. ఫాగింగ్ ద్వారా ప్రజలకు హాని కలగకుండా స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు.
శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు మార్చాలని,కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి కి సూచించారు. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కమిషనర్ సతీష్ కుమార్ ని కోరారు.చేత్త సేకరణ సైతం రోజువారీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ సతీష్,ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి,నాయకులు బద్ధం నాగార్జున రెడ్డి, అర్ధ ప్రతాప్ రెడ్డి, కృష్ణ యాదవ్,సిబ్బంది నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.
