పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విలేకరి
దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన తుమ్మల అభిమానులు

దమ్మపేట ,ఆంధ్రప్రభః రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూ ట్యూబ్ ఛానల్ విలేకరిపై దమ్మపేట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ విలేకరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

గత 40 సంవత్సరాల నుండి రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జీవితం తెరిచిన పుస్తకం అని ,ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించే తుమ్మలపై యూట్యూబ్ విలేకరి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ దమ్మపేట ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి కి కాంగ్రెస్ నాయకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ ,దమ్మపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, అడపా రాంబాబు,కాసాని నాగప్రసాద్, ఎండి వలీ పాషా ,ఎర్రా వసంతరావు,ప్రభాకర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ,తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply