అవినీతి రహిత పాలన అందిస్తాం

అవినీతి రహిత పాలన అందిస్తాం

  • మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ ముసుకుల మహేందర్ రెడ్డి

మంథని, ఆంధ్రప్రభ : మంథని మునిసిపల్ లో అవినీతి రహిత పాలనను అందిస్తామని.. మంథని అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మునిసిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి లు అన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డిలను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టులు ఎంతో కీలకమైన వ్యక్తులని ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన వారికే ముందుగా తెలుస్తుందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి జర్నలిస్టులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎంపికలో అర్హులను గుర్తించేందుకు సహకరించాలన్నారు. జర్నలిస్టుల సహకారం తో మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం జర్నలిస్టులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్, ఉపాధ్యక్షులు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం ఆంజనేయులు, కోశాధికారి తగరం రాజు, సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి, కొమురోజు చంద్రమోహన్, అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్ల బాపు, పెండ్యాల రాంకుమార్, లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్, ఒజ్జల శ్రీనివాస్, లింగాల సురేష్, దొరగొర్ల రవీందర్, కేసారపు రవి, బండారి సమ్మయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.


Leave a Reply