వేతనాల బడ్జెట్ విడుదల..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ వసతి గృహంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్ల వేతన నిధుల బడ్జెట్ ను గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ విడుదల చేసినట్లు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బడ్జెట్ నిధులు రూ. 75 లక్షల 50వేలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రూ. 42,50,000, నిర్మల్ జిల్లాకు రూ. 16,20,000, మంచిర్యాల్ జిల్లాకు రూ. 13,50,000 మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ఉమ్మడి 4 జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న నాలుగు తరగతి ఉద్యోగులు వర్కర్లు గమనించాలని ఆయన పేర్కొన్నారు క్వార్టర్ నిధులు మంజూరు చేసిన గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కు కేబీసీ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
