204వ రోజు మండలికి నివాళులు…

204వ రోజు మండలికి నివాళులు…
నాగాయలంక – ఆంధ్రప్రభ : నాగాయలంకలోని సాయిబాబా గుడి సమీపంలో మండలి కూడలిలో ఉన్న స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా 204వ రోజు నాగాయలంక మండల నిర్వహణ కమిటీ సభ్యులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావుకి పూలమాలలు అలంకరణ చేసారు. నాగాయలంకలో దివి సీమ పునఃనిర్మాత, తెలుగు జాతి రత్నం స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నిర్వహణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
శత జయంతి వేడుకలనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, వక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్, మాదివాడ అర్జునరావు, బీజేపీ సీనియర్ నాయకులు చన్నగిరి లతా మోహన్, ఉప్పల ప్రసాద్, నాగాయలంక పిఏసిఎస్ సభ్యులు తాడేపల్లివెంకట పాపారావు, జనసైనికులు బండ్రెడ్డి హరి,ఈవూరి నాగార్జున, గుడివాక శివరావు (గుర్లాయి) మండల బిజెపి అధ్యక్షుడు గుడివాక శివాజీ, సనక శేషు భోగాది అనురాధ, తలశిల రామకృష్ణ , మర్రిపాలెం మాజీ సర్పంచ్ బండ్రెడ్డి బోసు, తానంకి చంటి, రేమాల బాబూరావు, తలశిల శివరామకృష్ణ, షేక్ జానీ, రేమలవారిపాలెం ఉప సర్పంచ్ పేర్ల భీమేశ్వరరావు, భోగాది సతీష్, చందన సుబ్బారావు, తోట కొండలు, మమ్మారెడ్డి శ్రీనివాసరావు, మెండు లక్ష్మీనారాయణ, మద్ది సుబ్బారావు, మేడికొండ బసవరావు, ముమ్మారెడ్డి సురేష్, భోగిరెడ్డి బుజ్జి, కుటుంబరావు ,సజ్జా శివ నాగేశ్వరావు, దోవారి ప్రభాకర్, మదివాడ వీరస్వామి, మద్ది సాంబశివరావు, మద్ది నరసింహారావు తదితర పెద్దలు మండలం నుంచి కూటమి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు.
