ప్రశాంత వాతావరణంలో పరీక్షలు…

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు…
- జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఎక్కడికక్కడ పక్కాగా ఏర్పాటు చేయాలని పోలవరం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఆయన రంపచోడవరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఆకస్మికంగా పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తారీకు నుండి మార్చి నెల 24 తారీకు వరకు జరుగు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటర్మీడియట్ కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, త్రాగునీటి సౌకర్యం తదితరవి ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు కొచ్చిన్ పేపర్ చదివి వచ్చిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయాలని విద్యార్థులకు ఆయన తెలిపారు. ప్రతి ఇంటర్మీడియట్ కేంద్రంలో మాస్ కాపింగ్ లకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.


