ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్

ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్
ప్రధాని గ్లోబల్ సమ్మిట్ తో దేశాల ప్రతినిధులు స్ఫూర్తి
ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్..
నిజామాబాద్ , ఆంధ్రప్రభ : మన్ కీ బాత్” అంటే దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ వేదిక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యా లయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహి స్తున్న మన్ కీ బాత్ కార్యక్ర మాన్ని కార్యకర్తలు నాయ కులతో కలిసి అర్బ న్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ వీక్షిం చారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. ఈ కార్యక్ర మం ద్వారా దేశ అభి వృద్ధి, సాంకేతిక పురోగతి, యువతలో స్ఫూర్తి, రైతు ల సాధనలు, క్రీడా రంగ విజయాలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక అంశాలపై అవగాహన కలుగుతుంది అని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా గ్లోబల్ ఏ వన్ ఇంపాక్ట్ సమ్మిట్ విజయాన్ని ప్రస్తా విస్తూ, భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపం చానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఏ వన్ ద్వారా జంతువులకు వైద్యం, రైతులకు, పశు సంవర్ధక రంగానికి అందు తున్న సేవలు ప్రాచీన భారతీయ గ్రంథా లను ఆధునిక సాంకేతిక తతో సంరక్షిస్తున్న విధా నం దేశ గౌరవాన్ని పెంచుతోందని అభిప్రా యపడ్డారు. అవయవ దానం పై ప్రధాన మంత్రి ప్రస్తావించిన విషయాలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అవయవ దానం మహోన్నత సేవ అని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందిం చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
10 నెలల వయసు గల చిన్నా రి అలిన్ చేరిన్ అబ్రహం హఠాత్తుగా మృతి చెంది నప్పటికీ వారి తల్లిదం డ్రులు అరుణ్ అబ్రహం, శరీన్ అబ్రహంలు ఎంతో మనోధైర్యంతో తమ కూతురి అవయవాలను దానం చేయడం వారి మానవత్వానికి నిదర్శ నమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్ర మంలో ప్రస్తావించడం జరిగిందన్నారు. డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, కేవైసీ ప్రక్రియ లను అధికారిక మార్గా ల్లోనే పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. “వోకల్ ఫర్ లోకల్” సందే శాన్ని అందరూ ఆచరణ లో పెట్టాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిం చాలని ఎమ్మెల్యే కోరారు. రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జిల్లా పదాధికారులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా ప్రభరి విక్రం రెడ్డి, యువ మోర్చా ప్రతిని ధులు, మహిళా మోర్చా సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
