Sri Lakshmi Venkateswaraswamy | విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు..

Sri Lakshmi Venkateswaraswamy | విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు..
Sri Lakshmi Venkateswaraswamy, ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ (కనేకల్ క్రాస్)లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో, నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. 24వ తేదీన తెల్లవారుజామున 4.15 నిమిషాలకు మకర లగ్నం నందు శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, గోమాత పూజ, ద్వారాపూజ, యోగశాల ప్రవేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కళ స్థాపన, రక్షాబంధనము, సప్త మాతృకా, నందీపూజ, నవగ్రహ ఆరాధన, వాస్తు, గణపతి నవగ్రహ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహా మంత్ర జపములు, మధ్యాహ్నం 12-30 నిమిషాలకు మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగమని తెలిపారు.
సాయంత్రం 6:15 నిమిషాలకు షోడసోపచారపూజలు, దీక్షా హోమం, అంకురార్పణము, వాస్తు మండలారాధన, మూల మంత్ర జపములు, జలాధివాసం, మంత్రపుష్పం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగములు. 25వ తేదీన ఉదయం 7.15 నిమిషాలకు మంత్ర జపములు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పారాయణం, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ గాయత్రీ దేవి సహస్రనామ జపములు, ఉదయం 10 గంటలకు మహా స్నపనము, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హోమము, శ్రీ పవమాన హోమం, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగములు. సాయంత్రం 6 గంటలకు క్షీర తర్పణము, శ్రీ మహాగణపతి, నవగ్రహ వాస్తుహోమములు, శ్రీ గాయత్రీ దేవి హోమము, ధాన్యాధి, శయ్యాధి, పుష్పాధి వాసములు, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగములు. 26వ తేదీన
తెల్లవారుజామున 3.45 నిమిషాల నుండి 5.35 నిమిషాల లోపు మకర లగ్నము నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, స్వామివారి కల్యాణోత్సవం, బలిహరణ, పూర్ణహుతి, మంత్రపుష్పం, మహా మంగళహారతి, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉండబండ స్వామి వో కె పద్మనాభంశాస్త్రి, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు కరణం సాయి కృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
23వ తేదీన ఉదయం 10 గంటలకు షిరిడి సాయిబాబా దేవాలయం దగ్గర నుండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్స్ కాలనీ (కనేకల్ క్రాస్)లో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి స్వామి వారి విగ్రహం చేరుతుందని తెలిపారు.
