గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

మర్రిగూడ, ఆంధ్రప్రభ ; తిరుగండ్లపల్లి గ్రామ పంచాయతీ లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించి తిరుగండ్లపల్లి సర్పంచ్ పందుల లక్ష్మమ్మ జంగయ్య గౌడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామిడి భూపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగమణి,వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
