Hall tickets | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

Hall tickets | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

  • ఈ నెల 23 నుండి ఇంటర్ పరీక్షలు

Hall tickets | నరసరావుపేట, ఆంధ్రప్రభ : ఈ నెల 23 నుండి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ అధికారిణి ఎం నీలావతి దేవి అన్నారు. స్థానిక జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో గురువారం నీలావతి దేవి విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్స్ పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా ఎవరైన హల్ టిక్కెట్లు తీసుకోని వారు ఉంటే వెంటనే తీసుకోవాలన్నారు. విధి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.

ప్రశ్న పత్రాలు కూడా ఈ రోజు నుండి పల్నాడు జిల్లాలో ఉన్న 16 పోలీస్ స్టేషన్లకు చేరుకుంటున్నాయని, పరీక్షలకు సంబంధించిన సామీగ్రి అంతా కేంద్రాలకు పంపించడం జరిగిందని, ఈ పరీక్షలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో జరుగుతున్నాయని, దీనిపై జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కేంద్రాలలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కంట్రోలు రూం ఏర్పాటు చేశామని, సందేహాలు వున్న వారు 08647- 223355 అనే ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చన్నారు.

Hall tickets | విద్యార్థుల తల్లి దండ్రులకులకు విజ్ఞాప్తి

విద్యార్థిని, విద్యార్థులు ముందుగానే పరీక్షాకేంద్రాలకు ముందుగానే వెళ్ళి అడ్రస్ తెలుసుకోవాలన్నారు. ఉదయం 8 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 8.30 గం॥లకు పరీక్షా హాలులోనికి అనుమతిస్తారని, 9.00 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9.00 గం||ల తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించరని తెలిపారు.

Leave a Reply