Revanth reddy | దళితులకు పట్టం కట్టాం..

Revanth reddy | దళితులకు పట్టం కట్టాం..
70 వేల ఉద్యోగాలు ఇచ్చాం — డౌట్ ఉంటే చూసుకోవచ్చు…
Revanth reddy | ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనుమానం ఉంటే వాటి వివరాలు ఇస్తామని చెక్ చేసుకోవాలన్నారు. గ్రూప్ -1 ఉద్యోగాలను కేసులతో అడ్డుకోవాలని చూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీలకు స్పీకర్, నాలుగు మంత్రి పదవులు ఇచ్చి వారిని గౌవరవించుకున్నమన్నారు. ఎస్సీలను సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పి వారే అధికారలు అనుభవించారని విమర్శించారు.
బంజారా భవన్ లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో లంబాడాల పాత్ర మరువలేనిదని వారిని సీఎం కొనియాడారు. ప్రతి తండాలో బీటీ రోడ్లు వేయాలని అధికారలను అదేశిస్తుంచారు. అలాగే ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాలను ఏర్నాటు చేయాలన్నారు. అన్నీ తండాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మీకు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం చదువు ఇవ్వాలనుకుంటోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బాగా చదివి IAS IPS ఆఫిసర్లు కావానలని ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు. భూములు, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించొద్దు, 100 నియోజకవర్గంల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
