SILVER|కొండెక్కి కూర్చుందండి..!

SILVER|కొండెక్కి కూర్చుందండి..!

  • మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు
  • తులం గోల్డ్ రూ.3,150 పెరిగింది
  • సిల్వ‌ర్ ఏకంగా రూ.20వేలు ఎగ‌బాకింది

SILVER|ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : బంగారం మాట ఎత్తితే భ‌య‌మేస్తోంది. ఇక వెండి గురించి మాట్లాడే ప‌రిస్థితి లేదు. ఈ రెండింటి ధ‌ర‌లు మార్కెట్‌లో ఒక‌దానికి మించి మ‌రొక‌టి దూసుకుపోతున్నాయి. నీ కంటే నేనేం త‌క్కువ కాద‌ని గోల్డ్‌తో వెండి కూడా పోటీ ప‌డుతోంది. ఇటీవ‌ల బంగారం, వెండి ధ‌ర‌లు కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ ఇవాళ (శ‌నివారం) మ‌ళ్లీ పెరిగాయి. ముఖ్యంగా వెండి కొండెక్కి కూర్చుంది. ఒక్క‌రోజే కిలో వెండి ధ‌ర రూ.20వేలు పెరిగింది. బంగారం రేటు స్వ‌ల్పంగా పెరిగింది. ఏ రోజు ఏం ధ‌ర‌లు ఉంటాయో అర్ధం కాక సామాన్య‌లు బెంబేలెత్తుతున్నారు. అస‌లే శుభ‌కార్యాలు ముంచుకొస్తున్నాయి. బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా పెరిగితే కొనేదెలా అని ఆందోళ‌న చెందుతున్నారు.

క్రితం రోజుతో పోలిస్తే.. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. కిలో వెండి ధర శనివారం రూ.20వేల మేర ఎగబాకింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,61,150 పలికింది. ముందురోజు ధరతో పోలిస్తే రూ.3,150 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550గా ఉంది. శుక్రవారం కిలో వెండి రూ.2,60,000 పలకగా.. నేడు రూ.2,80,000కు చేరింది.

Leave a Reply