Petition | బస్సులు పునరుద్ధరించాలి…

Petition | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామం నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు పునరుద్ధరించాలని నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య కు మాజీ సర్పంచ్ మాలిపటేల్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వినతి పత్రం సమర్పించారు. గత 25 ఏళ్ల నుండి చిన్నపొర్ల నుండి హైదరాబాదుకు ప్రతినిత్యం బస్సు వెళుతుండదని కరోనా సమయం నుండి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

చిన్నపొర్ల నుండి హైదరాబాదుకు ఉదయం 5 గంటలకు, చిన్నపోర్ల నుండి మక్తల్ కు ఉదయం 8 గంటలకు బస్సు నడపాలని సాయంత్రం ఐదు గంటలకు మక్తల్ నుండి చిన్న పోర్లకు బస్సు నడపాలని కోరారు. చిన్న పొరల నుండి హైదరాబాద్ కు ఉదయం 5:30 గంటలకు బస్సు నడపడం వల్ల మండలంలోని కొల్లూరు, మల్లేపల్లి, ఎడవెల్లి, పెద్దపోర్ల, చిన్నపోర్ల గ్రామాల ప్రయాణికులు వివిధ పనులు వ్యాపారం నిమిత్తం మహబూబ్ నగర్, హైదరాబాద్ వెళ్తారని ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సునుపునరుద్ధరించాలని కోరారు.

అందుకు స్పందించిన డిపో మేనేజర్ లావణ్య రీజినల్ మేనేజర్ తో మాట్లాడి బస్సు పునరుద్ధరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బందే నవాజ్, గాండ్ల ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply