Nomination |నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

Nomination |నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
Nomination |పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ కోసం ఏర్పాట్లను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ పద్మజ రాణి, సుజాత, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
