Collector | శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం

Collector | శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

Collector | కర్నూలు, ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం ద్వారా అహింస, ధర్మం, నైతిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డి.ఆర్.వో వెంకట నారాయణమ్మ తదితరులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి చిత్రపటానికి పూలమాల వేసి, భక్తి శ్రద్ధలతో స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తనను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్న రాజు విష్ణువర్ధనుడి కోరికను నిరాకరించి, దానివల్ల జరిగే యుద్ధాన్ని, రక్తపాతాన్ని నివారించడం కోసం, తన ప్రజల గౌరవాన్ని కాపాడటం, అహింస, ధర్మం, సత్యం అనే ఉన్నత విలువల కోసం ఆమె అగ్నిప్రవేశం చేసి, ఆత్మార్పణ చేసిన మహానుభావురాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలిపారు.

వాసవి మాత తన ఆత్మార్పణ ద్వారా అహింస, ధర్మం, మానవ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కలెక్టర్ కొనియాడారు. చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply