Request | బెల్ట్ షాపులు తొలగించాలి

Request | బెల్ట్ షాపులు తొలగించాలి

  • కలెక్టర్ బాలాజీకి వినతి

Request | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : గ్రామంలో ఏర్పాటు చేసిన లిక్కర్ బెల్ట్ షాపులను తొలగించాలని కోరుతూ సోమవారం మచిలీపట్నంలో జరిగిన మీ కోసం జిల్లా కలెక్టర్ బాలాజీకి వినతి పత్రాన్ని అందజేశారు. దాశినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం నివాసం ఉంటున్నానని తెలిపారు. మా గ్రామంలో మూడేళ్లుగా సుమారు 5 ప్రదేశాలలో లిక్కర్ బెల్ట్ షాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

అవనిగడ్డ నుంచి అశ్వరావుపాలెం వెళ్లే మెయిన్ రోడ్డులో, లంకమ్మ మన్యం ప్రదేశం వద్ద, చదువుకునే ఆడపిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే దారులలో ఈ బెల్ట్ షాపులను నిర్వహించడమే కాకుండా, మద్యం సేవిస్తున్న వ్యక్తులు ఇష్టానుసారంగా మద్యం సేవించి బహిరంగంగా రోడ్లపై సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందించడం లేదన్నారు. లిక్కర్ బెల్ట్ షాపుల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుని మూసివేయించాల్సిందిగా కోరారు. అర్జీపై పలువురు గ్రామస్తులు సైతం సంతకాలు చేశారు.

Leave a Reply