Nandyala | ఘనంగా పారువేట ఉత్సవం

Nandyala | ఘనంగా పారువేట ఉత్సవం
- ఎక్కడైనా దేవుడి కోసం భక్తులు కొండెక్కుతారు..
- ఈ అహోబిలేసుడు భక్తుల కోసం కొండ దిగుతాడు..
- 33 గ్రామాల్లో దేవుడి పర్యటన..
- దేశంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం దేవాలయ ప్రత్యేకత
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశంలోనే అతి కొన్ని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉన్న అహోబిలం వైష్ణవ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన జ్వాలర్ నరసింహస్వామి ఉండే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఏర్పాటు చేశారు. ఈ పుణ్యక్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి ఆధ్వర్యంలో కొలువై ఉన్న అహోబి లేసుడు భక్తుల కోసం కొండ దిగి ఊరురా వెళ్ళటం ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికోసం ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ అనంతరం 35 రోజులపాటు 33 గ్రామాలను దేవుడు సందర్శిస్తాడు. ఈ పారువేట ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల ప్రజలు దేవుని ఆహ్వానిస్తారు. ఈ పారువేటకు ఇంటర్నేషనల్ క్రేజ్ ఉండటం విశేషం. దేశంలో నరసింహ స్వామి పారువేట జరపండి, మేము ఖర్చు భరిస్తాము,ప్రపంచంలో ఎక్కడ లేని సంప్రదాయం ఈ ప్రాంత ప్రజలకు ఉండటం ఆ భగవంతునిపై భక్తి ఆరాధ్య దైవం పెరగటం సంతోషదాయకం. భగవంతుడి ప్రసన్నం కోసం భక్తులు కొండ ఎక్కుతారు, కానీ ఇక్కడ మాత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
అహోబిలేశ్వరుడు మాత్రం భక్తుల కోసం కొండ దిగుతాడు.
శుక్రవారం ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి దిగువ అహోబిళానికి వచ్చారు. నల్లమల అటవీ ప్రాంత అహోబిలేశ్వరుడు ఆళ్లగడ్డ కేంద్రం చేసుకొని 35 రోజులపాటు 33 గ్రామాల్లో ఎటా పార్వేట ఉత్సవం లాగానే అహోబిల ఆలయ అధికారులు అనుమతితో గ్రామాలకు భగవంతున్ని ఆహ్వానిస్తారు.

జ్వాలా నరసింహ స్వామి పార్వేట ఉత్సవాలను ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని మఠం ప్రత్యేక అధికారి రామానుజన్ సెతురామన్ తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు విదేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు అందరూ కూడ ఈ అహోబిలేసుని పార్వేట ఉత్సవాలకు హాజరుకావటం విశేషం.నరసింహ స్వామి పార్వేట ఉత్సవాలు ప్రతి ఏడాది ఇదే సమయంలో జరిగి తీరు తాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం పార్వేట ఉత్సవంలో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలం నుండి జ్వాలా నరసింహ స్వామి వారు దిగువ అహోబిలంకు చేరుకున్నారు. దిగువ అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామి వారికి అదివన్ శఠగోప స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉత్సవంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్గారు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజనం, మనియార్ సౌమ్యనారాయణన్, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
