visit | భీమన్నను దర్శించుకున్నమంత్రి సీతక్క

visit | వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. భీమన్న సన్నిధికి చేరుకున్న మంత్రికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేష్ గీతే, ఎస్పీ రుత్విక్ సాయి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం మంత్రి స్వామి వారికి కోడె మొక్కును చెల్లించుకుని.. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి వెంట ఉండి స్వామి వారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందేలా చూశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే మంత్రిని మర్యాదపూర్వకగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. భీమన్న దర్శనం అనంతరం మంత్రి బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
