అవకాశం ఇవ్వండి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం

8వ వార్డు బిజెపి అభ్యర్థి గజ్జల లావణ్య- లక్ష్మణ్

కాగజ్ నగర్ టౌన్ ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని 8వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 8వ వార్డు బిజెపి అభ్యర్థి గజ్జల లావణ్య- లక్ష్మణ్ లు అన్నారు.బుధవారం వార్డులో ఇంటింటా తిరుగుతూ కమలం పువ్వు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధ్య లోపం లేకుండా చూస్తానని ఓటర్లకు మాటిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి, ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి 8 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply