మీ బిడ్డగా ఆశీర్వదించండి..మీలో ఒక్కడిగా ఉంటా!

5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొంతం రజిత శ్రీనివాస్
-చేయి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
-లోతట్టు ప్రాంతాల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
-వార్డులో 25 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది
-గల్లీల్లో సీసీ రోడ్లు, మోరీలు, పైప్‌లైన్ల ఏర్పాటు చేస్తాను
-మినీ వాటర్ ట్యాంక్, సెంట్రల్ లైటింగ్‌కు ప్రతిపాదనలు పంపించా.
-రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
-కరెంట్ పోల్స్, విద్యుత్ సదుపాయాలను కల్పిస్తాను
-మహిళా సంఘానికి సొంత భవనం నిర్మాణానికి చర్యలు
-అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛనులు, సంక్షేమ పథకాలు
-అందరికి నిరంతరం అందుబాటులో ఉంటాను
-5వ వార్డులో కాంగ్రెస్ జెండా గెలుపు ఖాయం
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: శ్రీనివాస్ రాజకీయ జీవితమంతా ప్రజల మధ్యే గడిచింది. కాంగ్రెస్ పార్టీ లో ఎన్నో ఏళ్లుగా నిబద్ధ కార్యకర్తగా ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ప్రజ ల మదిలో నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజాసేవను కుటుంబ బాధ్యతగా భావించిన శ్రీనివాస్. అదే సేవా భావంతో తన సతీమణి కొంతం రజితను రాజకీయ రంగంలో నిలబెట్టారు. మంచి మనసున్న వ్యక్తిగా ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే స్వభావం కలి గిన శ్రీనివాస్‌ను వార్డులో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ గౌరవి స్తారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చి నా ఈ ఎన్నికల్లో మాత్రం 5వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయ మని వార్డు ప్రజలు ధీమాగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చేయి గుర్తుకు, సీరియల్ నెంబర్ ఒకటోవ ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు.
-ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య ఆశీస్సులతో అభివృద్ధి:
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొంతం రజిత శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం అభ్యర్థి వార్డులోని నెలకొన్న పలు సమస్యలను గుర్తించి, పరిష్కారానికి హామీలు ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల విష యంలో వార్డులోని నిరుపేదలకు అన్యాయం జరిగింది. అప్పట్లో పాలక మండలి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది వాస్త వమని పేర్కొన్నారు. ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేం దుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
-కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తాను:
కుమ్మరి కుంట సమీపంలోని లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు కాలనీల నుంచి అలాగే తహసీల్దార్ కార్యాలయం వైపు నుంచి చేరి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పాలకుర్తి రోడ్డు నుంచి రైస్ మిల్లు వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.2 కోట్ల అంచనాతో ఎస్టిమేట్ వేసి ఎమ్మెల్యేకు ప్రతిపా దనలు అందించామని చెప్పారు. వార్డులో గతంలో మంజూరైన 30 ఇండ్లకు అదనంగా మరో 10ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అర్హులకు నీతి, నిజాయితీగా ఇళ్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గల్లీల్లో సీసీ రోడ్లు, మోరీలు, పైప్‌లైన్లు లేని ప్రాంతాలను గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. వార్డులో గోదాం వెనుక భాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం, అలుగు సమ్మయ్య ఇంటి నుంచి బుల్లా సోమయ్య పొలం వరకు మురికి నీరు నిలవకుండా కొత్త మోరీలు నిర్మించడం వంటి పనులు చేపడతానన్నారు. అలాగే రైల్వే స్టేషన్ సమీ పంలోని హోటల్ ఎల్లయ్య ఇంటి నుంచి పాలకుర్తి రోడ్డు వరకు, గంగార పు సుధాకర్, అమరేందర్ ఇళ్ల వద్ద మోరీలు, సీసీ రోడ్లు లేని సమస్యల ను పరిష్కరిస్తానన్నారు. ఆకుల వెంకటేశ్వర్లు ఇంటి నుంచి గోరంతలవా డ వరకు సైడ్ డ్రైనేజీతో పాటు పైప్‌లైన్ పనులు, రైల్వే స్టేషన్ లకావత్ శ్రీనివాస్ నుంచి కుంట కట్ వరకు రోడ్డు వెడల్పు, ఇరు వైపులా మోరీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరెంట్ పోల్స్ లేని ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఇంటి పన్నులు విపరీతంగా పెరిగా యని, వాటిపై మెయిన్ రోడ్డు, లోపల పరిధిలో ఒక తీర్మానం చేయించి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. పాలకుర్తి రోడ్డులో రైల్వే నుంచి లక్ష్మీ వెంచర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అంశాన్ని ఎమ్మెల్యేకు ప్రతిపా దించామని తెలిపారు. కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని, మహిళా సంఘానికి సొంత భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటా నన్నారు. ప్రభుత్వ భూమిలో పెండింగ్‌లో ఉన్న రెండు ఎకరాల స్థలంలో స్మశాన వాటికకు ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాట్లు చేస్తామని, ఇప్పటి కే ఒక స్మశాన వాటికకు ఎమ్మెల్యే మంజూరు చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పింఛనులు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య సహకారంతో అమలు చేస్తామని కొంతం రజిత శ్రీనివాస్ వెల్లడించారు.
