స్నేహానికి ప్రతీక రంజాన్….

స్నేహానికి ప్రతీక రంజాన్….
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బొండా ఉమ
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్నేహానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముస్లిం సహోదరులతో కలసి ప్రార్ధనలు చేశారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు బొండా ఉమా తెలిపారు.
స్థానిక 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీ ఖానా ఆవరణలో 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా మైనారిటీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలిపారు.
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, అత్యధిక బడ్జెట్‌ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.చిత్తశుద్ధితో మైనార్టీ సమాజ అభివృద్ధికి అంకితభావంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు,ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్ బాషా,ఎస్. కె. వలి,ఛాన్ బాషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
