32 Hours Russia Ceasefire : రష్యా ఈస్టర్ ఫీస్ట్ Anhra Prabha News

32 Hours Russia Ceasefire : రష్యా ఈస్టర్ ఫీస్ట్ Anhra Prabha News
- రష్యా ఉక్రెయిన్ సీజ్ ఫైర్
- 32 గంటల విరామం
( ఆంధ్రప్రభ, కీవ్స్ ప్రతినిధి)

32 Hours Russia Ceasefire : ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగ వేళ ఉక్రెయిన్‌తో 32 గంటల కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ ఘర్షణలకు విరామం ఇవ్వాలని ప్రతిపాదించారు. రష్యా బలగాలు శనివారం సాయంత్రం 4 గంటల (ఈస్టర్న్ టైమ్ ప్రకారం ఉదయం 9 గంటల) నుండి ఆదివారం ముగిసే వరకు కాల్పుల విరమణను పాటిస్తారు. ఈ కాల్పుల విరమణ ఈ కాలంలో అన్ని రంగాలలో యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యా బలగాలను ను క్రెమ్లిన్ ఆదేశించింది. ప్రత్యర్థి వచ్చే రెచ్చగొట్టే చర్యలను, దురాక్రమణ చర్యలను తిప్పికొట్టడానికి సైనికులు సిద్ధంగా ఉండాలి” అని పేర్కొంది. “ఉక్రెయిన్ పక్షం కూడా రష్యన్ ఫెడరేషన్‌ను ఆదర్శంగా తీసుకుంటుందనే అంచనాతో ముందుకు వెళ్తున్నాం,” అని క్రెమ్లిన్ జోడించింది.
32 Hours Russia Ceasefire : ఈస్టర్ ఫీస్ట్ కోసం ..

ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా రష్యాకు పంపించారు. ఉత్తర ప్రత్యుత్తరాలకు విరామం ఇవ్వాలని ఉక్రెయిన్ పదేపదే కోరిందని జెలెన్స్కీ తన వెబ్సైట్లో పోస్ట్ చేశారు. “ఈ సంవత్సరం ఈస్టర్ సెలవుల్లో కాల్పుల విరమణను ప్రతిపాదించాం అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ప్రజలకు బెదిరింపులు లేని ఈస్టర్, శాంతి దిశగా నిజమైన పురోగతి అవసరం. ఈస్టర్ తర్వాత దాడులకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు రష్యాకు కూడా అవకాశం ఉంటుంది.” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, మాస్కో, కీవ్ రాయబారుల మధ్య చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది.
32 Hours Russia Ceasefire : నాలుగేళ్ల కీచులాట

గతంలో కాల్పుల విరమణ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. గత ఈస్టర్ పండుగ రోజున 30 గంటల కాల్పుల విరమణను పుతిన్ ప్రకటించారు, కానీ కాల్పులు ఆగలేదు. ఇరుపక్షాలు ఒరకి పై మరొకరు ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ ఉక్రెయిన్‌లో గుర్తించిన భూభాగంలో సుమారు 20 శాతాన్ని రష్యా ఆక్రమించుకుంది. ఇందులో క్రిమియా, దాదాపు మొత్తం లుహాన్స్క్ ప్రాంతం, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఈ నాలుగు భాగాలను ఉక్రెయిన్ వదిలేస్తే యుద్ధం ఆగుతుందని రష్యా పట్టుపడుతోంది. తన ఆధీనంలోని ప్రాంంతాలను వీడేది లేదని ఉక్రెయిన్ పట్టు పట్టింది. ఈ నాలుగు ప్రాంతాల కోసం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న నాలుగేళ్ల యుద్ధం.. తాజా ఈస్టర్ పండుగతో ఐదవ ఏటకు చేరింది. అత్యంత పవిత్ర దినంగా ఆర్థోడాక్స్ జరిపే తాజా క్రీస్తు పునరుత్థాన వేడుకతో … ఈ రెండు దేశాల మద్య శాంతి నెలకొనాలని ప్రపంచ జనం కోరుతున్నారు.
ALSO READ Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News
