కాంగ్రెస్ జోరు.. ప్రతిపక్షాలు బేజారు

కాంగ్రెస్ జోరు.. ప్రతిపక్షాలు బేజారు

24వ వార్డు లో రజని గెలుపు పక్కా

పెద్దపల్లి రూరల్ ఆంధ్రప్రభ : పట్టణంలోని 29వ వార్డులో కాంగ్రెస్ ప్రచార జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థులను వెనక్కి నెట్టి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లందుల రాజుని కృష్ణమూర్తి దూసుకుపోతుండడంతో ఆమె విజయం పక్కా అని వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతినిత్యం గడపగడపకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బ్యాలెట్ నమూనా నుంచి ఈనెల 11న జరిగే పోలింగ్లో ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో 29వ వార్డును పట్టణంలోనే ఆదర్శవాడిగా తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు నిధులు తెస్తామన్నారు. మరోసారి తమను ఆశీర్వదిస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని, ఎన్నికలు అయిపోగానే తిరిగి ఆ నాయకులు కనబడరని, తాము మాత్రం వార్డు పరిధిలోనే ఉండి నిత్యం సేవలందిస్తామన్నారు. అన్ని వర్గాల నుండి ఇల్లందుల రజనీర్ కృష్ణమూర్తికి మద్దతు లభించడంతో ఆమె విజయం ఖాయం అయిపోయింది.

Leave a Reply