ఆశీర్వదించి ఆదరించండి అభివృద్ధి చేస్తా..

ఆశీర్వదించి ఆదరించండి అభివృద్ధి చేస్తా..

  • 22వ వార్డు అభ్యర్థి కడకంచి బాలమణి శ్రీనివాస్

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉందని మున్సిపల్ వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుందని ఈ మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే ఆదరించి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపెడతానని 22 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కడకంచి బాలమని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం అనేక నిధులు రక్షిస్తుందని అన్నారు. కొన్ని సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాలా తీన్చారని కానీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జలంధర్ కడగంచి మధు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply