10days New hall tickets | దేశవ్యాప్తంగా అప్పుడే మళ్లీ పరీక్ష

10days New hall tickets | దేశవ్యాప్తంగా అప్పుడే మళ్లీ పరీక్ష
10days New hall tickets | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రశ్నపత్రం లీక్ వివాదంతో రద్దైన నీట్ యూజీ-2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు National Testing Agency (ఎన్‌టీఏ) నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని స్పష్టం చేశారు.
అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ వెల్లడించింది. గతంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. మే 3న నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు కొత్త హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు, సమయం తదితర పూర్తి వివరాలు అడ్మిట్ కార్డుల్లో ఉంటాయని తెలిపారు. అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను మాత్రమే గమనించాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించారు.
