108 ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
- ప్రకాశం జిల్లాలో విషాదం
పెద్దారవీడు ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రభ : కొన ఊపిరిలోని క్షతగాత్రుడి ప్రాణాలు నిలిపే.. 108 వాహన(108 vehicle)మే ఇద్దరిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఎస్ కొత్తపల్లి(S Kothapally) గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికుక సమాచారం మేరకు, పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైకు(Bike)పై మార్కాపురం వెళ్తుండగా, మార్కాపురం(Markapuram) నుంచి వస్తున్న వాహనం ఎస్ కొత్తపల్లిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకు పై ఉన్నఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు.