అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

  • ఇంటింటి ప్రచారంలో తెలంగాణ ఉద్యమకారుడు నీలప్ప
  • రైటప్: ఓటర్ల మద్దతు కోరుతున్న 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప

మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధికి అండగా నిలవండి అంటూ మక్తల్ మున్సిపల్ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి. నీలప్ప విజ్ఞప్తి చేశారు. గురువారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప కు మద్దతుగా ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది. గడపగడపకు వెళ్లి కర్రెం చెన్నమ్మ నీలప్పను గెలిస్తే 10వ వార్డులో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను వివరించారు.

కర్రెమ్ చెన్నమ్మ నీలప్ప కే ఎందుకు ఓటు వేయాలి వేయడం వల్ల జరిగే లాభం ఏంటి అనే అంశాలను వివరించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 10వ వార్డు అంబేద్కర్ నగర్ ,భరత్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు శాశ్వతంగి మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు.అధికార పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.

ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విన్నవించారు. స్థానికుడైన మంత్రి మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు .ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం కొనసాగుతుందన్నారు. మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 10వ వార్డు నుండి బరిలో నిలిచిన కర్రెం చెన్నమ్మ నీలప్ప హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థి మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply