పులివెందులలో పసుపు జెండా రెపరెపలు…

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనం రేపిన పులివెందుల జడ్పీటీసీ (Pulivendula ZPTC) ఉప ఎన్నికల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైఎస్ జగన్ (YS Jagan) సొంతగడ్డగా భావించే ఈ కోటను టీడీపీ (TDP) చారిత్రాత్మకంగా చేజిక్కించుకుంది. హోరాహోరీగా సాగిన పోటీలో చివరికి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Mareddy Latha Reddy) భారీ మెజారిటీతో విజయం సాధించడం, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

పులివెందుల జడ్పీటీసీ (Pulivendula ZPTC) స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలలో హోరా హోరీగా పోటీ పడిన టీడీపీ.. చివరికి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్ధి, ఎమ్మెల్సీ బీటెక్ రవి (MLC BTech Ravi) సతీమణి మారెడ్డి లతారెడ్డి ఏకంగా 6050 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు.

పులివెందుల జడ్పీటీసీ స్ధానానికి మొన్న జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మారెడ్డి లతారెడ్డి ((Mareddy Latha Reddy) కి మొత్తం 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి హేమంత్ రెడ్డి (Hemanth Reddy) కి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధి లతారెడ్డి ఏకంగా 6050 ఓట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. పోలింగ్ రోజు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రెండో రోజు రీపోలింగ్ ను, ఇవాళ కౌంటింగ్ ను సైతం బహిష్కరించిన వైసీపీ అనుకున్న ఫలితం కాకపోయినా పరువు దక్కించుకోవడంలోనూ విఫలమైంది.

Leave a Reply