ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్న (Wrestler Neha) సోమవారం భారత సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎస్ఐ) రెండేళ్లు సస్పెండ్ చేసింది. 59 కేజీల కేటగిరీలో పోటీ పడే ఆమె తరుచుగా బరువు నిర్వహణలో విఫలమవుతున్న కారణంగా వేటు వేసింది. అంతేకాకుండా, వచ్చే నెలలో జరిగే సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్ స్క్వాడ్ (Senior World Championship squad) నుంచి కూడా తప్పించింది. ఆమె స్థానంలో సారిక మాలికను తీసుకుంది. ఆమె వరల్డ్ చాంపియన్షిప్ ట్రయల్స్ లో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు వరల్డ్ చాంపియన్షిప్ జరగనుంది.
ఇటీవల బల్గేరియాలో జరిగిన అండర్ – 20 వరల్డ్ చాంపియన్ షిప్ నేహా అధిక బరువు కారణంగా అయ్యింది. అర్హత బరువు కంటే 600 గ్రాములు ఎక్కువగా ఉంది. నేహా తరుచుగా బరువు నిర్వహణలో ఇబ్బంది పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘బరువు నిర్వహణ రెజ్లర్ చూసుకోవాల్సిన విషయం. బల్గేరియాలో 59 కేజీల కేటగిరీలో మేము పతకాన్ని కోల్పోయాం. మాకు కూడా బాధ్యత ఉంది. టోర్నమెంట్ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఒక్క రెజ్లర్ పై 2-3 లక్షలు ఖర్చు చేస్తుంది. బరువును చూసుకోకపోతే మరో ఉత్తమమైన రెజ్లర్ కు అవకాశం ఇస్తాం.’ అని డబ్ల్యూఎఫ్ఎస్ఐ తెలిపింది.