లక్నో: డబ్ల్యూపీఎల్ మూడో సీజన్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు (గురువారం) లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ముంబై 6 వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించి నాకౌట్ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జార్జియా వాల్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా… గ్రేస్ హారిస్ (28), కెప్టెన్ దీప్తి శర్మ (27) పరుగులు సాధించారు. మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యాయి. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 5 వికెట్లతో విజృంభించింది. హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు తీయగా.. పరునికా సిసోడియా, నాట్ స్కివర్-బ్రంట్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియాన్స్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఎమ్‌ఐ బ్యాటర్లలో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (68; 46 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సీవర్ బ్రంట్ (23 బంతుల్లో 37) దకూడుగా ఆడటంతో ముంబైకు భారీ విజయం దక్కింది.
పాయింట్ల పట్టికలో ఇలా..
ఈ ఫలితంతో మహిళల ప్రీమియర్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో ముంబై జట్టు 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో 10 పాయింట్లతో కొనసాగుతొంది.
టోర్నీలో లీగ్ దశ ముగిసే సరికి తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ చేరతాయి. అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. 2, 3 స్థానాల్లోని జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది.