ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!

ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!

వెండి కిరిటాలు, బంగారపు ఉంగరాలు నాకొద్దు..!
నా జీవితంలో ‘జే’ టాక్స్ వసూళ్లు ఉండవు..!
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మాచర్ల, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆర్యవైశ్యుల పట్టణ, యువజన, మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జూలకంటిని వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో జాతిపిత గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనతరం ఆర్యవైశ్య పట్టణాధ్యక్షులుగా గరిణే శ్రీనివాసరావు, యువజన సంఘం అధ్యక్షులుగా కొత్తూరి చందు,మహిళా సంఘం అధ్యక్షురాలిగా సొలస కళ్యాణిలతో పాటు కార్యవర్గ సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి, ప్రారంభించే సమయంలో ఆత్మ బలిదానానికి గుర్తు విగ్రహాన్ని నిర్మించామని మంత్రి లోకేష్ ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రభుత్వ అధికార దినోత్సవంగా ప్రకటించి, వైశ్యుల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించారని వివరించారు.

రియల్ ఎస్టేట్ వెంచర్లు, నూతన అపార్ట్మెంట్ ప్రారంభోత్సవాలు, షాపింగ్ కాంపెక్స్ లు, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాల సమయంలో యాజమాన్యం అందించే వెండి కిరిటాలు,బంగారపు ఉంగరాలు తనకొద్దు అని, అటువంటి వాటికి నేను వ్యతిరేకమని ఎమ్మెల్యే జూలకంటి తేల్చి చెప్పారు. పిన్నెల్లి సోదర్లు వలె టాక్స్ లు, పీడించి మరి బహుమతులను తాను డిమాండ్ చేయనని, అటువంటి సాంప్రదాయానికి తాను విరుద్దమన్నారు. బానిస సంకేళ్లు తెంపి, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజాజీవనం, వ్యాపారాలు సాగేలా పాలన సాగిస్తానని ఆనాడు ఇచ్చిన హామీకి ఎప్పుడూ కట్టుబడే ఉన్నానని చెప్పారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం జే టాక్స్ వంటి వసూళ్లు ఉండబోవని, అటువంటి ఎట్టిపరిస్ధితిలో ఒప్పుకొనని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిచడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. రూ. 1200 కోట్లతో జల్ జీవన్ మిషన్, రూ. 130 కోట్లతో అమృత్ స్కీం, రూ. 3 వేల 240 కోట్లతో వరికపూడిశెల నిర్మాణాలు జరుగుతాయని, అవి పూర్తి అయిన నాడు నియోజకవర్గ రూపురేఖల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply