లారీ కింద పడి..

లారీ కింద పడి..

పుట్టపర్తి అక్టోబర్ 8 ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని వెంగళమ్మ చెరువు గ్రామానికి చెందిన మహబూబ్ బీ (60) లారీ కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బుధవారం ఉదయం మహిళ బహిర్భూమికి వెళ్లి వస్తుండగా అప్పుడే AP 16 TJ 5149 నంబర్ గల లారీ వెనుకకు వెళుతున్న క్రమంలో అప్పటికే ఇటువైపు నుండి ఇంటికి వెళుతున్న సదరు మహిళను వెనుక చక్రాల కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.

అయితే లారీ రివర్స్ చేస్తున్న సమయంలో వెనుకకు చూసుకోక పోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. మృతి చెందిన మహిళకు వినికిడి లోపం ఉన్నదని లారీ వచ్చేది గమనించకపోవడంతో ఆమె లారీ కిందపడి మృతి మృతి చెందింది. పుట్టపర్తి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply