ఎస్పీ ఆదేశాలతో

  • కదలిన పోలీసు యంత్రాంగం

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్(Visible Policing)ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ సునీల్ షెరాన్‌(Sunil Sheran) శుక్రవారం ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్(Police Station)ల పరిధిలలో విజిబుల్ పోలీసింగ్‌ను పోలీసు అధికారులు ప్రారంభించారు.

వాహన తనిఖీలు, రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనలు , సమాజంలో ప్రస్తుతం జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన మొదలు పెట్టారు. మోటారు వాహన చట్టాన్నిఉల్లంఘింస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత, సురక్షిత జీవనం లక్ష్యంగా “శక్తి(Shakti)” మొబైల్ యాప్(Mobile App) పై అవగాహన కల్పించారు, ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఒక్క క్లిక్‌తో పోలీసులకు సమాచారాన్ని అందించవచ్చుఅన్నారు.

ఇది 24/7 అందుబాటులో ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో ఎస్ ఓ ఎస్(SOS) బటన్ నొక్కగానే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి, ఆపదలోని బాధితులను రక్షిస్తారని వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్(Helmet) ధరించాలని సూచిస్తున్నారు. కార్ల డ్రైవర్లు(Car Drivers) సీటు బెల్టు వేసుకోవాలన్నారు. సెల్ ఫోన్(Cell Phone) డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు.

ముఖ్యంగా మైనర్లు(Minors) డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply