కోరిన కోరిక‌లు తీర్చే స్వామి…

కోరిన కోరిక‌లు తీర్చే స్వామి…

దండేపల్లి, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని గూడెంలో వెలసిన శ్రీ రమసాహిత సత్యనారాయణ స్వామిని ఈ రోజు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు(Nadipalli Diwakar Rao) దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యనారాయణ స్వామి దశాబ్దాల కాలంలో వెలిశాడు.

ఇక్కడకు వచ్చిన భక్తులు ఏ కోరికలు కోరుకున్నా ఆ స్వామి వారిని ఎల్లప్పుడు చల్లగా చూసి వారి కోరికలు తీరుస్తాడని అన్నారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్(Chunchu Srinivas), మాజీ వైఎస్ ఎంపీపీ పసార్తి అనిల్,లాశెట్టి రమణ, నాయకులు గొట్ల భూమన్న, పిట్టల రాజన్న కొట్టే సతయ్య పాల్గొన్నారు.

Leave a Reply