గుడిలోని దైవం ముందు కనులు ఎందుకు మూసుకుంటారు?

స్వామి దర్శనానికై గంటల కొలది నిలబడి స్వామి ముందుకు వెళ్లగానే కనులు మూసుకుని నమస్కారం చేస్తారు. భగవంతుడిని చూసిన వెంటనే ఆ మూర్తిని కనులలో నింపుకుని కనుల ద్వారా హృదయంలో చేర్చడం అనగా భగవంతుడిని హృదయంలో ప్రతిష్టింప చేయడం కనులు మూసుకోవడంలోని ఆంతర్యం. జపతపాదుల సమయంలో కూడా కనులు మూసుకుని ఏ దేవత మంత్రాన్ని జపిస్తామో ఆ దేవతను అంత:హృదయంలో సాక్షాత్కరించుకోవడం ఆ దేవతని చూసినట్లు తన్మయం చెందడం ఇందులోని అంతరార్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *