31. పాపములనుజేసి బ్రతికియుండుటకన్న
దైవశక్తి చేత చావమేలు
ముక్తినిచ్చినావు ముష్కరులకు కూడ
గీతదాత నీకు కేలుమోడ్తు
32. కొండయంతయయిన గోరంతయనునట్లు
నీదుకనులయందు నిఖిలజగము
కృష్ణభజన జ్ఞానతృష్ణను తీర్చును
గీతదాత నీకు కేలుమోడ్తు
33. అంతుబట్టనట్టి అద్భుతలీలలు
కనులముందు జూపి ఘనతపొంది
ద్వాపరయుగమంత దడదడలాడించు
గీతదాత నీకు కేలుమోడ్తు