Web News | ఆంధ్రప్రభ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ…

Web News | ఆంధ్రప్రభ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ…
Web News | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జై నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటి ఆవరణలో ఇవాళ జైనూర్ మార్కేట్ కమిటి చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, జైనూర్ మండల తహసిల్దార్ అడ భీర్షవ్, అసిఫాబాద్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాధవరావు, సహకార చైర్మన్ కోడప హన్ను పటేల్ తో కలిసి ఇవాళ ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 88 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ దినపత్రికమారిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహిన వర్గల సమస్యలను, హక్కుల గురించి పరిపూర్ణంగా వ్రాసే పత్రికని కోనియాడారు.
ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోయి సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న ఆంధ్రప్రభ పత్రిక అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రభలో పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని, ఆంధ్రప్రభ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్(Web News) ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు క్షణలలో డిజిటల్ విధనంలో సమాచారాన్ని చేరవేస్తున్నారని తెలిపారు.
నిజాలను నిర్భయంగా రాసి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెస్రం అంబాజీరావు, కుమ్రం శంకర్, ఆత్రం జలీంషా, మెస్రం భూపతి, మెస్రం శేఖు, గేడం లక్ష్మన్, జుగ్నాక మహెష్, ఉధ్యోగి మధు తదితరులు పాల్గొన్నారు.
