పోలీస్ స్టేషన్లలో ఆయుధ, వాహనపూజలు
పెద్దపల్లి ఆంధ్రప్రభ : విజయదశమి పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గురువారం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి శమీపూజ నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు సిబ్బంది ఆయుధ, వాహన పూజల్లో పాల్గొన్నారు. జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి అంబర్ కిషోర్ ఝా దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు.

